భారీగా పతనమైన మార్కెట్‌ సూచీలు - Sensex dips 500 pts
close

Published : 04/03/2021 09:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీగా పతనమైన మార్కెట్‌ సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం భారీగా విలువ కోల్పోయాయి. ఉదయం 9.31 సమయంలో నిఫ్టీ 194 పాయింట్లు  కోల్పోయి 15,050 వద్ద, సెన్సెక్స్‌ 646 పాయింట్లు పతనమై 50,797 వద్ద కొనసాగుతున్నాయి. గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్స్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, ఏఐఏ ఇంజినీరింగ్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌, దీపికా నైట్రేట్‌ షేర్లు లాభాల్లో ఉండాగా.. మొజెస్కో, జయప్రకాశ్‌ అసోసియేట్స్‌, అయాన్‌ ఎక్స్‌ఛేంజి, బాలాజీ ఎమ్నీస్‌, టాటాస్టీట్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒక్క ఆయిల్‌ అండ్‌ గ్యాస్ సూచీ మినహా మిగిలిన రంగాల సూచీలు నష్టాల్లో ఉన్నాయి. భారత్‌ విక్స్‌ సూచీ దాదాపు 5శాతం పైగా పెరగడం మార్కెట్లో భయాలను పెంచింది. 

అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా టెక్నాలజీ షేర్ల విక్రయాలు, జాబ్‌ డేటా నిరాశాజనకంగా వెలువడటం వంటి కారణాలతో మార్కెట్లు పతనం అయ్యాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. 

ఇవీ చదవండి

కొవాగ్జిన్‌ టీకా ప్రభావశీలత 81%

కారు విలాసం కాదు.. అవసరం

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని