భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు - Sensex down by 1000 pts
close

Updated : 30/04/2021 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయమే బలహీనంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సెన్సెక్స్‌ ఒక దశలో 1000 పాయింట్లకు పైగా పతనమైంది. ఉదయం 49,360 వద్ద నష్టాలతో ప్రారంభమైన సూచీ చివరకు 983 పాయింట్లు కోల్పోయి 48,782 వద్ద ముగిసింది. ఓ దశలో 1,067 పాయింట్లు కోల్పోయిన సూచీ 48,698 వద్ద  ఇంట్రాడే కనిష్ఠాన్ని చవిచూసింది. నిఫ్టీ 263  పాయింట్లు దిగజారి 14,631 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.89 వద్ద నిలిచింది. 

కొవిడ్‌ భయాలతో పాటు ఆసియా మార్కెట్ల డీలా దేశీయ సూచీలపై ప్రభావం చూపింది. పైగా యూరోజోన్‌ జీడీపీ అంచనాల కంటే భారీగా కుంగడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి సంకేతాలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీనికితోడు బ్యాంకింగ్‌, ఆర్థిక, వాహన, టెలికాం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అలాగే గత నాలుగు రోజుల వరుస లాభాల పొందడం, వచ్చే నెల మొదట్లో లాక్‌డౌన్‌ ప్రకటన ఉంటుందన్నప్రచారం నేపథ్యంలో  నేడు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ పరిణామాలతో నేడు సూచీలు భారీ నష్టాల్ని చవిచూశాయి. 

ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, దివీస్‌ ల్యాబ్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఐఓసీఎల్‌ షేర్లు లాభపడగా.. హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని