50,000 దిగువకు సెన్సెక్స్‌ - Sensex down by 500 pts
close

Published : 17/03/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

50,000 దిగువకు సెన్సెక్స్‌

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కాసేపు లాభాల్లోకి వెళ్లాయి. అనంతరం కిందకు దిగజారి మళ్లీ పైకి లేచాయి. ఉదయం 11:30 గంటల సమయంలో ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. ఇక అక్కడి నుంచి పడడం మొదలు పెట్టిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో చివరకు భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఉదయం 50,436 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 50,561 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం 49,718 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 562 పాయింట్లు నష్టపోయి 49,801 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 14,946 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 14,956 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 14,696 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 189 పాయింట్లు నష్టపోయి 14,721 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.54 వద్ద నిలిచింది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.

ఆయిల్ అండ్‌ గ్యాస్‌, సీపీఎస్‌ఈ, పీఎస్‌యూ రంగాల సూచీలు 3శాతానికి పైగా నష్టపోయాయి. ఐటీసీ లిమిటెడ్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, దివీస్‌ ల్యాబ్‌ షేర్లు లాభాలను ఆర్జించగా.. ఓఎన్‌జీసీ, భారత్‌ పెట్రోలియం, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని