ఒడుదొడుకులను దాటుకుని లాభాల్లోకి.. - Sensex ends high amid volatile session
close

Published : 11/02/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒడుదొడుకులను దాటుకుని లాభాల్లోకి..

ముంబయి: రెండు రోజుల ఒడుదొడుకుల తర్వాత దేశీయ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ షేర్లలో లాభాలు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 15,150 మార్క్‌పైన స్థిరపడింది. 

ఆటోమొబైల్‌, ప్రభుత్వ రంగ షేర్లలో లాభాల స్వీకరణతో ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒక దశలో 51,157.31 వద్ద కనిష్ఠ స్థాయికి పడిపోయిన సూచీ.. రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఇంట్రాడేలో 51,592.45 గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ.. చివరకు 222 పాయింట్ల లాభంతో 51,531.52 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 66.80 పాయింట్ల లాభంతో 15,173.30 వద్ద స్థిరపడింది. 

ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. నిఫ్టీలో హిందాల్కో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, గెయిల్‌ షేర్లు లాభపడగా.. ఐషర్‌ మోటార్స్‌, టైటాన్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, టాటామోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.

ఇవీ చదవండి..

ఆగని పెట్రోల్‌ మంట

పీఎమ్‌జేడీవై ఖాతాదారులకు రూ. 2లక్షల బీమా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని