స్టాక్‌ మార్కెట్లు రోజంతా నష్టాల్లోనే.. - Sensex falls 400 pts in a day
close

Updated : 17/02/2021 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌ మార్కెట్లు రోజంతా నష్టాల్లోనే..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఉదయం 52,014 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరకు 400 పాయింట్లు నష్టపోయి 51,703 వద్ద ముగిసింది. అదే ట్రెండ్‌ను కొనసాగించిన నిఫ్టీ 15,279 వద్ద ప్రారంభమై.. చివరకు 115 పాయింట్లు నష్టపోయి 15,197 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.79 వద్ద నిలిచింది. కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సెన్సెక్స్‌ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 52,071 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌ 51,605 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఇంట్రాడేలో రెండు పాయింట్ల అత్యల్ప లాభంతో 15,315 వద్ద గరిష్ఠాన్ని తాకి.. 15,186 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. ఇటీవల భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు స్థిరీకరణ దిశగా సాగాయి. అలాగే కీలక బ్యాంకింగ్‌, ఐటీ, ఆర్థిక రంగాల్లో అమ్మకాల వెల్లువ సూచీలను పూర్తిగా కట్టడిచేశాయి. ఆసియా మార్కెట్లతో పాటు దాదాపు అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల్లో ముగియడం కూడా సూచీలను ప్రభావితం చేసింది.

పీఎస్‌యూ, ఇన్‌ఫ్రా, టెలికాం, విద్యుత్తు, ఇంధన రంగ సూచీలు లాభపడ్డాయి. హెల్త్‌కేర్‌, ఆర్థిక, ఐటీ, బ్యాంకింగ్‌, స్థిరాస్తి, ఎఫ్‌ఎంసీజీ రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇక హీరోమోటోకార్ప్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోల్‌ ఇండియా కంపెనీల షేర్లు లాభాలను ఒడిసిపట్టగా.. నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ సుజుకీ ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని