ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు - Sensex falls 430 pts in a day
close

Updated : 23/02/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి ఉదయమే తేరుకున్న మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అయినప్పటికీ.. కీలక రంగాల మద్దతు లభించడంతో కొంత సానుకూలంగా కదలాడాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం సూచీలపై ప్రభావం చూపింది. ఉదయం సెన్సెక్స్‌ 50,104 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ 14,782 వద్ద ఆరంభమైంది. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ దశలో సెన్సెక్స్‌ 49,666 వద్ద, నిప్టీ 14,655 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. కానీ లోహ, స్థిరాస్తి, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల మద్దతుతో వెంటనే కోలుకుని సెన్సెక్స్‌ 50,316 వద్ద, నిఫ్టీ 14,849 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరాయి. తిరిగి అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో చివరకు సెన్సెక్స్‌ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 49,751 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు ఎగబాకి 14,707 వద్ద స్థిరపడింది. మొత్తంగా ఈరోజు ఈరోజు సూచీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.46 వద్ద నిలిచింది.

బ్యాంకింగ్‌, ఆర్థిక, టెలికాం మినహా మిగిలిన రంగాల సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా లోహ రంగ సూచీ 3.71 శాతం లాభపడగా.. స్థిరాస్తి, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీలు రెండు శాతానికి పైగా ఎగబాకాయి. ఇక టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌ షేర్లు లాభాలను ఒడిసిపట్టగా.. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, మారుతీ సుజుకీ ఇండియా, బజాజ్‌ ఆటో, దివీస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని