లాభాలతో ప్రారంభమై.. నష్టాలతో ముగిసె - Sensex falls 450 pts in a day
close

Updated : 16/02/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాలతో ప్రారంభమై.. నష్టాలతో ముగిసె

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం 52,398 వద్ద శుభారంభం చేసిన సెన్సెక్స్‌ చివరకు 49 పాయింట్లు నష్టపోయి 52,104 వద్ద ముగిసింది. అదే ట్రెండ్‌ను కొనసాగించిన నిఫ్టీ.. 15,371 వద్ద సానుకూలంగా ప్రారంభమై చివరకు 1 పాయింట్‌ నష్టపోయి 15,313 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.69 వద్ద నిలిచింది. ఉదయం 52,431 వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌ క్రమంగా దిగజారుతూ వచ్చింది. మధ్యాహ్నం పూర్తిగా నష్టాల్లోకి జారుకొని 51,871 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇదే బాటలో పయనించింది. ఇంట్రాడేలో 15,247 వద్ద కనిష్ఠాన్ని, 15,422 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని రికార్డు చేసింది. నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం ప్రభావం చూపింది. దీంతో కీలక బ్యాంకింగ్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

విద్యుత్తు రంగ సూచీ 3.41 శాతం, లోహ రంగం 3.08 శాతం, ఇంధన 1.65 శాతం లాభపడ్డాయి. ఐటీ 0.95 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.70 శాతం, ఆర్థిక రంగ సూచీ 0.25 శాతం నష్టపోయింది. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని