మార్కెట్‌ అప్‌డేట్‌: ఆరంభ లాభాలు ఆవిరి - Sensex falls 585 pts
close

Updated : 18/03/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్‌ అప్‌డేట్‌: ఆరంభ లాభాలు ఆవిరి

ముంబయి: దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. సెన్సెక్స్‌ 500 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 14,600 మార్కు దిగువన ముగిసింది. అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం (బాండ్‌ ఈల్డ్స్‌) మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సూచీలు వరుసగా ఐదో సెషన్‌లోనూ నష్టాలు మూటగట్టుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 72.53గా ఉంది.

ఉదయం 50,232 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం వరకు అదే ఊపు కొనసాగించింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో నేల చూపులు చూసింది. చివరికి 585.10 పాయింట్ల నష్టంతో 49,216 వద్ద ముగిసింది. ఇంట్రాడే గరిష్ఠాల నుంచి వెయ్యికి పైగా పాయింట్లను కోల్పోయింది. ఇక నిఫ్టీ సైతం 163.45 పాయింట్ల కోల్పోయి 14,557.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, దివీస్‌ ల్యాబ్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఐటీసీ లిమిటెడ్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.

ఇవీ చదవండి..

క్యాడ్బరీపై సీబీఐ కేసు నమోదు

ఏడాదిలోగా టోల్‌ప్లాజాలు తొలగిస్తాం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని