Stock market: లాభాలకు బ్రేక్‌.. భారీ నష్టాల్లో మార్కెట్‌ సూచీలు - Sensex falls over 500 pts dragged by metals
close

Published : 20/09/2021 16:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాలకు బ్రేక్‌.. భారీ నష్టాల్లో మార్కెట్‌ సూచీలు

ముంబయి: గత వారం కొత్త రికార్డులు నెలకొల్పుతూ లాభాల్లో దూసుకెళ్లిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. దీనికి తోడు ఇటీవల సూచీలు భారీ లాభాలు చవిచూసిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమూ మరో కారణమని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లు సోమవారం నాటి ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 500 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ సైతం కీలకమైన 17,400 మార్కు దిగువన ముగిసింది.

ఉదయం 58,647 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపు లాభాల్లోకి వెళ్లినా తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 524.96 పాయింట్లు నష్టపోయి 58,490.93 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 188.30 పాయింట్లు కోల్పోయి 17,396 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.74గా ఉంది. నిఫ్టీలో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌, ఎస్‌బీఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. హెచ్‌యూఎల్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ షేర్లు రాణించాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లూ నష్టాలు చవిచూశాయి. మెటల్‌ సూచీ దాదాపు 7 శాతం మేర పడింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని