stock market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు..! - Sensex falls
close

Updated : 17/06/2021 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market: నష్టాల్లో మార్కెట్‌ సూచీలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.19 సమయంలో సెన్సెక్స్‌ 261 పాయింట్లు పతనమై 52,240 వద్ద.. నిఫ్టీ 85 పాయింట్లు పతనమై 15,618 వద్ద ట్రేడవుతున్నాయి. సొమాని సిరామిక్స్‌, నాథ్‌ బయో జీన్స్‌, బీఎఫ్‌ యుటిలిటీస్‌, సీఈఎస్‌ఈ, నిర్లోన్‌ సంస్థల షేర్లు లాభాల్లో ఉండగా.. సద్భావ్‌ ఇంజినీరింగ్‌,సెంచురీ టెక్స్‌టైల్స్‌,వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజ్‌, జీఐసీ హౌసింగ్‌,ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికాలోని ఫెడరల్‌ రిజర్వు భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచవచ్చనే సంకేతాలు వచ్చాయి. దీంతో భారత్‌, ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఇప్పటికైతే వడ్డీరేటును దాదాపు సున్నా వద్ద ఉంచి.. ప్రతినెలా 120 బిలియన్‌ డాలర్లు విలువైన బాండ్లు కొనుగోలు చేయనుంది. ఇక చమురు రేట్లలో పెరుగుదల వంటివి కూడా సూచీలపై ప్రభావం చూపించాయి. మొత్తం 33 కంపెనీలు నేడు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌,నాట్కో ఫార్మా,జమ్ముకశ్మీర్‌ బ్యాంక్‌, డీబీ కార్ప్‌,ఖాదిమ్‌ ఇండియా వంటి సంస్థలు దీనిలో ఉన్నాయి. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని