భారీ లాభాల్లో సెన్సెక్స్‌ - Sensex gains 250 points in pre open
close

Published : 01/04/2021 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ లాభాల్లో సెన్సెక్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్ల సూచీలు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. సెన్సెక్స్‌ ఉదయం 9.22 సమయంలో 396 పాయింట్లు లాభపడి 49,905 వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు లాభపడి 14,805 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌, జనరల్‌ ఇన్స్యూరెన్స్‌, నియోజన్‌ కెమికల్స్‌, వాల్టాంప్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. విల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సాఫ్ట్‌వేర్‌, యారీ డిజిటల్‌, అదానీ పవర్‌, ఫ్యూచర్‌ సప్లైచైన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఒక్క రియాల్టీ సూచీ తప్ప మిగిలిన రంగాలవి లాభాపడుతున్నాయి. 
 
అమెరికాలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో అక్కడి టెక్‌ కంపెనీల షేర్లు ఊపందుకున్నాయి. దీంతో నిన్న వాల్‌స్ట్రీట్‌ మంచి లాభాల్లో ముగిసింది. ఆ ప్రభావం దేశీయ స్టాక్‌మార్కెట్లపై పడింది. దీంతో ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు లాభాల బాటలో ఉన్నాయి. నిక్కీ, హాంగ్‌సెంగ్‌ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని