మార్కెట్‌ అప్‌డేట్‌: మళ్లీ బుల్‌ రంకె - Sensex gains 568 pts
close

Published : 26/03/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్‌ అప్‌డేట్‌: మళ్లీ బుల్‌ రంకె

ముంబయి: రెండు రోజుల వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్లు కోలుకుని మళ్లీ లాభాల బాటపట్టాయి. భారీ నష్టాలతో దిగొచ్చిన షేర్ల కొనుగోలుకు ఇదే తగిన సమయం అని మదుపరులు భావించడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు సూచీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. దీంతో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ మళ్లీ 49వేల మార్కు, నిఫ్టీ 14,500 మార్కును అందుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 72.51గా ఉంది.

ఉదయం 48,989 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడిన సూచీ.. చివరికి 568.38 పాయింట్ల లాభంతో 49,008.50 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 182.40 పాయింట్ల లాభంతో 14,507.30 వద్ద స్థిరపడింది. సుప్రీంకోర్టులో టాటా సన్స్‌కు అనుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో టాటా స్టీల్‌ షేర్లు దూసుకెళ్లాయి. దాదాపు 6 శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీలో టాటా స్టీల్‌తో పాటు బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఏషియన్‌ పెయింట్స్‌ హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ లిమిటెడ్‌ షేర్లు స్వల్పంగా నష్టాలను చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని