Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు - Sensex gains 613 pts
close

Updated : 18/05/2021 18:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను  ముగించాయి. కొవిడ్‌ కేసులు మూడు లక్షల దిగువకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా ఆటోమొబైల్‌ స్టాక్స్ ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ 612 పాయింట్లు పెరిగి 50,193 వద్ద, నిఫ్టీ 184 పాయింట్లు పెరిగి 15,108 వద్ద స్థిరపడ్డాయి.  గతి లిమిటెడ్‌, టీసీఐ ఎక్స్‌పోర్ట్స్‌, కేఈఐ ఇండస్ట్రీస్‌, వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు భారీ లాభాల్లో ఉండగా.. ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌ మెంట్‌, హింద్‌ కన్‌స్ట్రక్షన్‌ కో, హెస్టర్‌ బయోసైన్స్‌, కెనరా బ్యాంక్‌, బజాజ్‌ హిందూస్థాన్‌ షుగర్స్‌ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. 

ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా దేశీయ మార్కెట్లను ఉత్సాహపరిచాయి. ఐరోపా సూచీలు దాదాపు 0.4శాతం వరకు లాభపడ్డాయి. ఇక అమెరికా సూచీల ఫ్యూచర్‌లు కూడా లాభాల్లో ఉన్నాయి. డోజోన్స్‌ ఫ్యూచర్‌ 92పాయింట్లు పెరిగింది. జపాన్‌ నిక్కీ2శాతం, దక్షిణ కొరియా కేవోఎస్‌పీఐ 1.3శాతం, చైనా సీఎస్‌ఐ300 సూచీ 0.5శాతం లాభాల్లో ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని