stock market : లాభాల్లో మార్కెట్‌ సూచీలు - Sensex gains
close

Published : 03/06/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

stock market : లాభాల్లో మార్కెట్‌ సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.23 సమయంలో సెన్సెక్స్‌ 283 పాయింట్లు పెరిగి 52,132 వద్ద నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 15,661 వద్ద కొనసాగుతున్నాయి. స్నోమెన్‌ లాజిస్టిక్స్‌, కిరి ఇండస్ట్రీస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, బలరామ్‌పూర్‌ చినీ షేర్ల విలువ పెరగ్గా.. మదర్సన్‌ సుమీ సిస్టమ్స్‌, ఐఆర్‌బీ ఇన్ఫ్రా, న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌,మహా స్కూటర్స్‌ షేర్ల విలువ కుంగింది. అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

నేడు మొత్తం 29 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటిల్లో జీఎస్‌పీఎల్‌, అరవింద్‌ ఫ్యాషన్స్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ కంపెనీలు కూడా ఉన్నాయి. డాలర్‌తో రూపాయ మారకం విలువ 24పైసలు పతనమై రూ.72.68 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం విలువ రూ. 225 పెరిగి రూ.49,220 వద్ద, కిలో వెండి రూ.402 పెరిగి రూ.72,650 వద్ద ఉన్నాయి. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని