లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు - Sensex jumps 248 points to end at new peak
close

Published : 12/01/2021 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు తాజాగా మరోసారి జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ఉదయం ఊగిసలాట మధ్య మొదలైన సూచీలు చివరకు లాభాలను మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 248 పాయింట్లు లాభపడి 49,517 వద్ద ముగియగా, 78 పాయింట్ల లాభంతో నిఫ్టీ 14,563 వద్ద స్థిరపడింది.

ఉదయం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. నిన్న భారీ లాభాలు వచ్చిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 100 పాయింట్లు నష్టపోయి 49,237 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్న సూచీలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత పరుగులు పెట్టాయి. ఒకానొక దశలో 49,569 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకాయి. చివరకు 248 పాయింట్లు లాభపడి, 49,517 పాయింట్ల వద్ద ముగిసింది.

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో టాటా మోటార్స్‌, గెయిల్‌, ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా తదితర షేర్లు లాభపడగా, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌ కంపెనీ, హెచ్‌యూఎల్‌, నెస్లే, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని