కొత్త ఆర్థిక సంవత్సరం.. అదరగొట్టిన సూచీలు - Sensex jumps 520 points
close

Published : 01/04/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త ఆర్థిక సంవత్సరం.. అదరగొట్టిన సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్లు ఆర్థిక సంవత్సరాన్ని (2021-22) లాభాలతో ప్రారంభించాయి. ఆర్థిక సంవత్సరం తొలిరోజైన గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు అదరగొట్టాయి. మెటల్‌, ఫైనాన్షియల్‌ షేర్ల అండతో భారీ లాభాలను అందుకున్నాయి. దీంతో సెన్సెక్స్‌ మళ్లీ 50 వేల మార్కును చేరుకుంది.

ఉదయం 49,854 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే మళ్లీ దిగువకు చేరింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో చివరికి సెన్సెక్స్‌ 520.68 పాయింట్ల లాభంతో 50,029.83 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 176.70 పాయింట్ల లాభంతో 14,867.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాలు చవిచూశాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సూరెన్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని