close

Updated : 12/04/2021 10:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీ నష్టాల్లో మార్కెట్‌ సూచీలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు భారీ నష్టాల మధ్య ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.34 సమయంలో  నిఫ్టీ 429 పాయింట్లు పతనమై 14,405 వద్ద, సెన్సెక్స్‌ 1,403 పాయింట్లు పతనమై 48,188 వద్ద ట్రేడవుతున్నాయి.  జేఎంసీ ప్రాజెక్ట్స్, సోలార్‌ యాక్టివ్‌ ఫార్మా,బలరామ్‌పూర్‌ చినీ, ప్రివి స్పెషాలిటీ, నాట్కో ఫార్మా షేర్లు లాభాల్లో ఉండగా.. జేపీ అసోసియేట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,బ్యాంక్‌ఆఫ్‌బరోడా,అదానీ టోటల్‌ గ్యాస్‌, ఆదిత్యబిర్లా షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి సూచి, మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సోమవారమే వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు.  మరోపక్క కరోనా కేసులు భారీగా పెరగటం, చాలా నగరాల్లో కరోనా ఆంక్షలను కఠినతరం చేయడంతో వ్యాపారాలపై మళ్లీ ప్రభావం చూపిస్తుందనే భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. నేడు విడుదల కానున్న టీసీఎస్ త్రైమాసిక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిఫ్టీ50 సూచీలోని దాదాపు 40కిపైగా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని