Stock Market: నష్టాల్లో మొదలైన సూచీలు - Sensex opens down
close

Updated : 02/06/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: నష్టాల్లో మొదలైన సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్‌ 309 పాయింట్లు నష్టపోయి 51,625 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 15,504 వద్ద ట్రేడవుతున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌, సుమోటోమో కెమికల్స్‌, హిల్‌, మాగ్మా ఫిన్‌ కార్ప్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. నారాయణ హృదయాలయా, టీసీఐ లిమిటెడ్‌, ఇండోస్టార్‌ క్యాపిటల్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అత్యధికంగా విద్యుత్తు రంగం సూచీ 0.40శాతం లాభాల్లో ఉండగా.. బీఎఎస్‌ఈ ఎఫ్‌ఎంసీ సూచీ అత్యధికంగా 0.51శాతం నష్టాల్లో ఉంది.

నేడు మొత్తం 23 కంపెనీలు ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటిల్లో మదర్సన్‌సుమీ, ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌, ముత్తూట్‌ ఫినాన్స్‌, పీవీఆర్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. అమెరికాలో తయారీ రంగం పుంజుకొన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో డోజోన్స్‌ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 16పైసలు పతనమై రూ.72.44 వద్ద ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని