ఊగిసలాట ధోరణిలో దేశీయ స్టాక్‌మార్కెట్లు - Sensex opens flat
close

Published : 31/12/2020 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊగిసలాట ధోరణిలో దేశీయ స్టాక్‌మార్కెట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఊగిసలాటధోరణిలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.28 సమయంలో సెన్సెక్స్‌ 7 పాయింట్ల లాభంతో 47,753, నిఫ్టీ రెండు పాయింట్ల లాభంతో 13,984 వద్ద ట్రేడవుతున్నాయి. నేటితో డిసెంబర్‌ సిరీస్‌ డెరివేటీవ్‌ల కాంట్రాక్టు ముగియనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తు్న్నారు. కామా హోల్డింగ్స్‌, యార్రీ డిజిటల్‌, బోరోసిల్‌ రెనీవబుల్‌, జైప్రకాశ్‌ అసోసియేట్స్‌, మజెస్కో లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇండియా సిమెంట్‌, స్నోమెన్‌ లాజిస్టిక్స్‌, సటెర్లైట్‌ టెక్నాలజీస్‌, ఐటీడీ సెమినేషన్‌, ఎస్బా ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ, టెక్‌, ఫైనాన్స్‌, ఇన్ఫ్రా రంగాల సూచీలు కుంగాయి. రియాలిటీ, మెటల్‌, పవర్‌, చమురు, టెలికామ్‌ రంగాల సూచీలు పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ లాభపడింది. ప్రస్తుతం 13పైసలు లాభంతో రూ.73.31 వద్ద ట్రేడవుతోంది.

ఇవీ చదవండి

విమానంలో తరలివచ్చిన శాటిలైట్‌
ఒలెక్ట్రాకు రూ.300 కోట్ల ఆర్డర్లు

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని