స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా!
భారీగా పతనమైన సూచీలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 500 పైగా నష్టపోయింది. మార్కెట్ల ఒడుదొడుకుల్ని సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 19 శాతం నుంచి ఏకంగా 27 శాతానికి ఎగబాకింది. సాధారణంగా వీఐఎక్స్ పెరుగుదల మదుపర్ల అనిశ్చితి, భవిష్యత్తు భయాల్ని సూచిస్తుంటుంది. తర్వాతి రాబోయే 30 రోజుల్లో మార్కెట్ కదలికల్ని ఇది తెలియజేస్తుంటుంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి సూచీల్ని భారీగా దిగజార్చుతున్నాయి. ప్రారంభం నుంచే ప్రతికూలంగా ఉన్న మార్కెట్లకు ఏ దశలోనూ అండ దొరకలేదు. సెన్సెక్స్ టాప్ 30 కంపెనీల్లో కేవలం ఒకే ఒక్క కంపెనీ లాభాల్లో పయనిస్తుండడం సూచీలపై బేర్ బిగించిన పట్టుకు అద్దం పడుతోంది.
మధ్యాహ్నం 1:29 గంటల సమయంలో సెన్సెక్స్ 1693 పాయింట్లు కోల్పోయి 49,345 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 486 పాయింట్లు నష్టపోయి 14,607 వద్ద ట్రేడవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. సెన్సెక్స్ 49,000, నిఫ్టీ 14,450కి పడిపోయే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగ సూచీలు నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ 50లో ఒక్క ఎన్టీపీసీ 0.93 శాతం లాభాల్లో పయనిస్తుండగా.. మహీంద్రా అండ్ మహీంద్రా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్ షేర్లు ఐదు శాతానికి పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. నేను ఒక రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని, పెన్షన్ వస్తోంది. నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తుంటాను. దీనికి స్వల్ప కాల, దీర్ఘకాల మూలధన పన్ను ఎలా ఉంటుంది?
-
Q. ఏజెంట్ ద్వారా కాకుండా ఆన్లైన్ లో టర్మ్ పాలసీ తీసుకోవడం వలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేక లాభం ఏమైనా ఉంటుందా?
-
Q. నమస్తే సర్, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య తేడా వివరించగలరు? వీటిలో ఎందులో ఇన్వెష్ట్ చేస్తే మంచిది అని చెప్పగలరు.