వరుసగా ఐదో రోజూ లాభాలే! - Sensex rises 259 points
close

Published : 29/12/2020 16:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుసగా ఐదో రోజూ లాభాలే!

ముంబయి: దేశీయ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెన్స్‌ 259 పాయింట్లు లాభపడి, 47,613 వద్ద ముగియగా, 59 పాయింట్ల లాభంతో నిఫ్టీ 13,932 వద్ద స్థిరపడింది.

ఉదయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 228 పాయింట్లు లాభపడి ముందుకు సాగింది. ఒకానొక దశలో 47,714 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ ఆ తర్వాత ఒడిదొడులకు లోనైంది. 47,361 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. చివర్లో కోలుకుని 259 పాయింట్ల లాభంతో 47,613 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ రిలీఫ్‌ బిల్‌ను అమెరికా క్లియర్‌ చేయటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. 2.3ట్రిలియన్‌ డాలర్ల నిధుల విడుదలకు సంబంధించిన బిల్లుపై ట్రంప్‌ సంతకం చేయటం, ఇందులో కరోనా రిలీఫ్‌ ప్యాకేజ్‌ కింద 900 బిలయన్‌ డాలర్లు కేటాయించడంతో విదేశీ మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు తదితర షేర్లు లాభపడగా, కోల్‌ ఇండియా, ఎన్టీపీసీ, నెస్లే, హిందాల్కో, టాటామోటార్స్‌ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని