Stock Market: ఒక్క టెలికాం మినహా అన్ని రంగాలకు నష్టాలే! - Sensex rises over 456 pts
close

Updated : 20/10/2021 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: ఒక్క టెలికాం మినహా అన్ని రంగాలకు నష్టాలే!

ముంబయి: రికార్డుల జోరు నుంచి మంగళవారం వెనక్కి తగ్గిన సూచీలు నేడూ అదే బాటలో పయనించాయి. ఇటీవలి గరిష్ఠాల నేపథ్యంలో మదుపర్లు లాభాలు స్వీకరించడంతో సూచీలు నేడు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఒక్క టెలికాం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడాయి. ఐరోపా సూచీలు సైతం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్‌ ఉదయం 61,800.07 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 61,109.29 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని చేరింది. చివరకు 456.09 పాయింట్ల నష్టంతో 61,259.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 152.15 పాయింట్లు కోల్పోయి 18,266.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,209.35 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 నష్టపోయాయి. టైటన్‌, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఈ కుదుపులోనూ భారతీఎయిర్‌టెల్‌ ఏకంగా 4 శాతం మేర లాభపడడం విశేషం. ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని