స్టాక్‌ అప్‌డేట్‌: 47వేల మార్కూ పాయె! - Sensex slips 535 pts
close

Updated : 28/01/2021 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌ అప్‌డేట్‌: 47వేల మార్కూ పాయె!

ముంబయి: దేశీయ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ భారీ నష్టాలు చవిచూశాయి. కేంద్ర బడ్జెట్‌ ముందు మదుపరులు అమ్మకాలకు దిగడం, జనవరి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేటితో ముగియడం వంటి పరిణామాలతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లు డీలాపడ్డాయి. దీంతో సెన్సెక్స్‌ కీలకమైన 47వేల మార్కును కోల్పోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ సైతం 13 పైసలు క్షీణించి 73.05 వద్ద ముగిసింది.

ఉదయం 47,038 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. అమ్మకాల ఒత్తిడితో రోజంతా పడుతూనే ఉంది. మధ్యాహ్నం ఓ దశలో దాదాపు 900 పాయింట్ల మేర నష్టపోయింది. చివరికి కాస్త కోలుకుని 535.57 పాయింట్ల నష్టంతో 46,874.36 వద్ద ముగిసింది. నిఫ్టీ 150 పాయింట్ల నష్టంతో 13,817.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో హెచ్‌యూఎల్‌, మారుతీ సుజుకీ, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ప్రధానంగా నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, శ్రీసిమెంట్స్‌, ఐవోసీ, హీరో మోటోకార్ప్‌ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్‌ షేర్లు మినహా మిగిలిన రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఇవీ చదవండి..
బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రాయితీలు..!
అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని