దలాల్‌స్ట్రీట్‌లో బడ్జెట్‌ కళ - Sensex soars 1197 points to close at 49797
close

Published : 02/02/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దలాల్‌స్ట్రీట్‌లో బడ్జెట్‌ కళ

ముంబయి: దలాల్‌ స్ట్రీట్‌లో బడ్జెట్‌ సంబరాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలతో నిన్న ఉవ్వెత్తున ఎగిసిన సూచీలు.. మంగళవారం కూడా అదే జోరు ప్రదర్శించాయి. ఆటో, బ్యాంకింగ్‌ షేర్ల అండతో భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ దాదాపు 1200 పాయింట్లు ఎగబాకగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 14,600 మార్క్‌ దాటింది.

బడ్జెట్‌ బూస్ట్‌తో నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. 750 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 1400 పాయింట్లకు పైగా దూసుకెళ్లి మరోసారి 50వేల మైలురాయిని దాటింది. చివరకు 1197.11(2.46శాతం) పాయింట్లు ఆర్జించి 49,797.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 366.70(2.57శాతం) పాయింట్ల లాభంతో 14,647.90 వద్ద ముగిసింది. 

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. బ్యాంకింగ్‌, ఆటో, మౌలిక రంగ షేర్లు 3-4శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ దాదాపు 2శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో టాటామోటార్స్‌, శ్రీ సిమెంట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ, హిందాల్కో షేర్లు భారీగా లాభపడగా.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హీరో మోటార్స్‌, టైటాన్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌ షేర్లు నష్టపోయాయి.

మార్కెట్‌ దూకుడుకు కారణాలివే..

* సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో వృద్ధికి ఊతమిచ్చేలా నిర్ణయాలు ఉండటం, మౌలిక, ఆరోగ్య సంరక్షణ రంగాలకు కేటాయింపులు పెంచడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. 

* ఆటో, మౌలిక, ఆర్థిక రంగాలకు చెందిన దిగ్గజ షేర్లలో కొనుగోళ్లు సూచీల జోరును మరింత పెంచాయి.

* అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు పుంజుకోవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చింది.

* బడ్జెట్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా పెరగడం సూచీల లాభాలకు కారణమైంది. 

ఇవీ చదవండి..

నిర్భర బాట.. నిధుల వేట

పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని