Stock market: ఆరంభ లాభాలు ఆవిరి.. సూచీల జైత్రయాత్రకు బ్రేక్‌! - Sensex tumbled over 700pts
close

Updated : 17/09/2021 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఆరంభ లాభాలు ఆవిరి.. సూచీల జైత్రయాత్రకు బ్రేక్‌!

ముంబయి: మార్కెట్ల లాభాల జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. శుక్రవారం ఆరంభంలో అదరగొట్టిన సూచీలు చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయ సానుకూల సంకేతాలతో జీవనకాల గరిష్ఠాలకు చేరుకున్న సూచీలు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం. కొద్దిసేపు ఊగిసలాట ధోరణి కనబరిచినప్పటికీ.. చివరి గంటలో పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ కీలక మైలురాయైన 59,000, నిఫ్టీ 17,500 మాత్రం నిలపుకొన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.48 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 59,409.98 వద్ద దూకుడుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,737.32 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 125.27 పాయింట్ల నష్టంతో 59,015.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 44.35 పాయింట్లు కోల్పోయి 17,585.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో 17,792.95 వద్ద కొత్త రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది.

ఉపశమన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో నిన్న రాణించిన టెలికాం షేర్లు నేడూ పరుగులు తీశాయి. ఎయిర్‌టెల్‌ షేరు 1.39 శాతం లాభపడింది. బ్యాడ్‌ బ్యాంకుకు ప్రభుత్వ గ్యారెంటీ నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు కూడా దూసుకెళ్లాయి. ఇక ఇటీవల గరిష్ఠాలకు చేరిన లోహ రంగ షేర్లు అధికంగా నష్టపోయాయి. తర్వాత స్థిరాస్తి, బేసిక్‌ మెటీరియల్స్, ఇంధన, విద్యుత్తు రంగ షేర్లు కుదేలయ్యాయి.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 12 లాభపడ్డాయి. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ అత్యధికంగా 5.63% పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు మెరిశాయి. టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, టీసీఎస్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌ డీలాపడ్డాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని