భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - Sensex up by 100 pts
close

Updated : 15/02/2021 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం 374 పాయింట్ల లాభంతో 51,918 వద్ద సెన్సెక్స్‌ ప్రారంభమైంది. నిఫ్టీ 107 పాయింట్లు ఎగబాకి 15,270 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 501 పాయింట్లు లాభపడి 52,030 వద్ద, నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 15,288 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ తొలిసారి 52వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 15,300పై కన్నేసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.72 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ 1.3 శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా మార్కెట్లు ఒకశాతం మేర లాభపడ్డాయి. మొత్తంగా ఆసియా మార్కెట్లన్నీ సానుకూలంగానే కదలాడుతున్నాయి. ఐటీ రంగ షేర్లు దూసుకెళుతుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా చైనా, తైవాన్‌ ఎక్స్ఛేంజీలు గురువారం వరకు; ప్రెసిడెంట్స్‌ డే సందర్భంగా అమెరికా మార్కెట్లు నేడు పనిచేయవు.

వివిధ రంగాలకు చెందిన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. టెలికాం రంగం రెండు శాతం పైగా, బ్యాంకింగ్‌ రంగం 1.86 శాతం లాభాలతో దూసుకెళుతుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ 0.58 శాతం నష్టాల్లో కొనసాగుతోంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఓన్‌జీసీ, హీరోమోటోకార్ప్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

ఇవీ చదవండి...

జీఎస్‌టీ రిటర్న్‌లో భారీ అవకతవకలుంటే రిజిస్ట్రేషన్‌ సస్పెన్షన్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని