లాభాల్లో ముగిసిన మార్కెట్లు! - Sensex up by 200 pts
close

Updated : 23/03/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను లాభాల్లో ముగించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆద్యంతం లాభాల్లోనే కదలాడాయి. ఓ దశలో స్వల్ప కాలం పాటు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ.. తిరిగి పుంజుకుని ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. ఉదయం 49,876 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 49,661 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం 50,264 వద్ద గరిష్ఠానికి చేరింది. చివరకు 280 పాయింట్లు లాభపడి 50,051 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14,768 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 14,878-14,707 మధ్య కదలాడింది. చివరకు 78 పాయింట్ల లాభంతో 14,814 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.41 వద్ద నిలిచింది. 

అమెరికా మార్కెట్లు గతవారం లాభాలతో ముగియడం, బాండ్ల ప్రతిఫలాల్లో స్థిరత్వం, ఆసియా మార్కెట్ల సానుకూల కదలికలు నేడు మార్కెట్లను ముందుకు నడిపించాయి. అలాగే కీలక రంగాల్లోని షేర్లు లాభాల్లో పయనించడం సూచీలకు దన్నుగా నిలిచింది. ఈరోజు బీఎస్‌ఈలో దాదాపు 280 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ నేడు సూచీల సానుకూల కదలికలకు కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం పోర్టులో మెజారిటీ వాటాలు తమ కంపెనీ సొంతం చేసుకోనుందన్న వార్తల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు ఓ దశలో 10 శాతం మేర లాభపడ్డాయి.  శ్రీసిమెంట్‌, దివీస్‌ ల్యాబ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాలను ఆర్జించగా.. ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఐఓసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీసీ లిమిటెడ్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని