స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ జోష్‌! - Sensex up by 203 pts
close

Updated : 01/02/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ జోష్‌!

ముంబయి: మరికాసేపట్లో 2021-22 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. సోమవారం ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 277 పాయింట్లు లాభపడి 46,553 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 13,702 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.03 వద్ద కొనసాగుతోంది. బడ్జెట్‌పై మదుపర్ల అంచనాలను బట్టి సూచీల్లో నేడు ఒడుదొడుకులు కనిపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐవోసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, భారత్‌ పెట్రోలియం కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టెక్‌ మహీంద్రా, సిప్లా, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని