ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు - Sensex up by 25 pts
close

Updated : 10/02/2021 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఊగిసలాటలో పయనిస్తున్నాయి. 134 పాయింట్ల లాభంతో 51,463 వద్ద సెన్సెక్స్‌ ప్రారంభమైంది. ఓ దశలో 146 పాయింట్లు కోల్పోయింది. తిరిగి పుంజుకుని 70 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఇలా మార్కెట్‌ సూచీలు ఊగిసలాటలో పయనిస్తున్నాయి. బుధవారం ఉదయం 9:42 గంటల సమయంలో సెన్సెక్స్‌ 25 పాయింట్లు లాభపడి 51,373 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 15,126 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.88 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్ టీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని