కొనసాగుతున్న లాభాల జోరు - Sensex up by 300 pts
close

Updated : 16/02/2021 09:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనసాగుతున్న లాభాల జోరు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో లాభాల జోరు కొనసాగుతోంది. మంగళవారం 244 పాయింట్ల లాభంతో 52,398 వద్ద సెన్సెక్స్‌ ప్రారంభమైంది. నిఫ్టీ 57 పాయింట్లు ఎగబాకి 15,371 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 312 పాయింట్లు లాభపడి 52,466 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 15,430 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15,400 మార్క్‌ను తొలిసారి అందుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.62 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ 0.4 శాతం లాభాల్లో కొనసాగుతోంది. స్థిరాస్తి, ప్రభుత్వ రంగ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు దూసుకెళుతుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది.

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ స్థిరాస్తి 1.85 శాతం లాభాలతో దూసుకెళుతోంది. హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, దివీస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని