లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు - Sensex up by 450 pts
close

Updated : 05/05/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు లాభాల బాటలో పయనించాయి. ఉదయం 48,569 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరకు 424 పాయింట్లు లాభపడి 48,677 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 48,254 వద్ద కనిష్ఠాన్ని.. 48,742 వద్ద గరిష్ఠాన్ని చవిచూసింది. ఇదే ట్రెండ్‌ కొనసాగించిన నిఫ్టీ రోజులో 14,637-14,506 మధ్య కదలాడి చివరకు 121 పాయింట్లు ఎగబాకి 14,617 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 73.91 వద్ద నిలిచింది. కీలక రంగాల్లో షేర్లు రాణించడం, కొవిడ్‌ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు చిరు వ్యాపారులకు ఆర్బీఐ పలు ప్రోత్సాహకాలు ప్రకటించడం సూచీలకు దన్నుగా నిలిచింది. 

బీఎస్‌ఈ 30 జాబితాలో జబాజ్ ఫినాన్స్‌, ఏషియన్ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే నష్టాలు చవిచూశాయి... సన్‌ ఫార్మా, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, టైటన్, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని