ఎట్టకేలకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు! - Sensex up by 600 pts
close

Published : 19/03/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎట్టకేలకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

ముంబయి: వరుసగా ఐదు రోజుల పాటు నష్టాల్ని మూటగట్టుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు చివరకు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు నెమ్మదిగా పైకి ఎగబాకుతూ వచ్చాయి. అనంతరం కిందకు దిగజారి మళ్లీ పైకి లేచాయి. కాసేపటికే మళ్లీ నష్టాల్లోకి జారుకున్నప్పటికీ... కీలక రంగాల్లో మద్దతు లభించడంతో ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. ఉదయం 48,881 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 50,003 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం 48,586 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 641 పాయింట్లు లాభపడి 49,858 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14,471 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 14,788-14,350 మధ్య కదలాడింది. చివరకు 156 పాయింట్లు లాభపడి 14,714 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.52 వద్ద నిలిచింది.

మధ్నాహ్నం తర్వాత విద్యుత్తు, యుటిలిటీస్‌, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ, లోహ రంగ షేర్లతో పాటు కొన్ని కీలక కంపెనీల షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. అలాగే ఈ ఐదు రోజుల భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. ఇది సూచీలకు కలిసొచ్చింది. స్థిరాస్తి మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి. హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, దివీస్‌ ల్యాబ్‌, యూపీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ షేర్లు లాభాలను ఆర్జించగా.. టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని