నిర్మలమ్మ హామీలతో దూసుకెళ్తున్న మార్కెట్లు - Sensex up by 800 pts
close

Updated : 01/02/2021 11:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మలమ్మ హామీలతో దూసుకెళ్తున్న మార్కెట్లు

ముంబయి: 2021-22 బడ్జెట్‌లో కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం పలు పథకాలను ప్రకటించడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్‌ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించడం సూచీల సెంటిమెంటును పెంచింది. అవసరమైతే మరింత ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడబోమన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. అలాగే ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధిని ప్రకటించడం మార్కెట్లకు కలిసొచ్చింది. నూతన తుక్కు విధానం ప్రకటించడంతో ఆటో రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు సైతం భారీ లాభాలను మూటగట్టుకుంటున్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 9 శాతానికి పైగా లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు ఆరు శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం ఉదయం 11:47 గంటల సమయంలో సెన్సెక్స్‌ 809 పాయింట్లు లాభపడి 47,095 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 215 పాయింట్ల లాభంతో 13,850 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.03 వద్ద కొనసాగుతోంది. 

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, టీసీఎస్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

ఇవీ చదవండి...

బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని