ఆద్యంతం హుషారు.. సెన్సెక్స్‌ 51,000+ - Sensex zooms 1100 points
close

Updated : 03/03/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆద్యంతం హుషారు.. సెన్సెక్స్‌ 51,000+

ముంబయి: అంతర్జాతీయ సానుకూల పవనాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు రాణించడంతో వరుసగా మూడోరోజైన బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలను ఒడిసిపట్టాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకూ ఎగబాకుతూ పోయాయి. ఉదయం 50,738 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 51,539 వద్ద గరిష్ఠాన్ని.. 50,512 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1,147 పాయింట్లు లాభపడి 51,444 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 326 పాయింట్ల లాభంతో 15,245 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.83గా ఉంది.

అమెరికా ప్యూచర్స్‌ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు బుధవారం హుషారుగా సాగాయి. హాంకాంగ్ సూచీ హాంగ్‌సెంగ్‌ 2.7 శాతం, జపాన్‌ సూచీ నిక్కీ 0.5 శాతం, షాంఘై కాంపోజిట్‌ రెండు శాతం, ఆస్ట్రేలియా సూచీ ఎస్‌అండ్‌పీ/ఏఎస్‌ఎక్స్‌ 0.8శాతం లాభపడ్డాయి. అమెరికాలో కరోనా ఉద్దీపన పథకం ఆమోదం దిశగా పురోగతి కనిపిస్తుండడం ఆసియా మదుపర్లలో ఉత్సాహం నింపింది. ఐరోపా మార్కెట్లు సైతం మంగళవారం సానుకూలంగానే ముగిశాయి. ఇక దేశీయంగా ఇంధన, లోహ, ఆర్థిక, బ్యాంకింగ్‌, ఐటీ రంగాల షేర్లు రాణించడం సూచీలకు దన్నుగా నిలిచింది.

ఒక్క ఆటో మినహా నిఫ్టీలోని దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌, బజాజ్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు లాభాలను ఆర్జించాయి. హీరో మోటోకార్ప్‌, మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, భారత్ పెట్రోలియం షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని