భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు  - Sensex zooms 550 points
close

Published : 09/03/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు 

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీలాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఆర్థికరంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకున్న సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. ఉదయం 50,714 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 51,111 వద్ద గరిష్ఠాన్ని, 50,396 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 584 పాయింట్లు లాభపడి 51,025 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,049 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,126 - 14,925 మధ్య కదలాడింది. చివరకు 142 పాయింట్ల లాభంతో 15,098 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.99 వద్ద నిలిచింది. 

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయాయి. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ బలపడడం సూచీల్లో ఉత్సాహం నింపింది. ఇక ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. జపాన్‌ సూచీ నిక్కీ 1 శాతం, ఆస్ట్రేలియా సూచీ ఎస్‌అండ్‌పీ/ఏఎస్‌ఎక్స్‌ 0.5 శాతం, దక్షిణ కొరియా సూచీ కోస్పీ 0.7 శాతం, హాంగ్‌ కాంగ్ సూచీ హాంగ్‌ సెంగ్‌ 0.8 శాతం లాభపడ్డాయి. షాంఘై కాంపోజిట్‌ మాత్రం 1.8 శాతం నష్టపోయింది. ఇక దేశీయంగా బ్యాంకింగ్‌, ఆర్థిక, ఐటీ, సాంకేతిక రంగాల సూచీలు లాభపడ్డాయి. ఈ పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. 

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాలను ఆర్జించాయి. భారత్‌ పెట్రోలియం, టాటా స్టీల్‌, గెయిల్‌ ఇండియా, ఐవోసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని