Serum Institute: ఆక్సఫర్డ్‌ బయో మెడికాలో సీరం పెట్టుబడి..! - Serum Institute to invest 68 mn dollars in UK vaccine maker Oxford Biomedica
close

Published : 22/09/2021 22:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Serum Institute: ఆక్సఫర్డ్‌ బయో మెడికాలో సీరం పెట్టుబడి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ వ్యాక్సిన్‌ తయారీ దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఇండియా యూకేకు చెందిన టీకా సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టింది. మొత్తం 68.24 మిలియన్‌ డాలర్లను తమ సంస్థలో పెట్టుబడిగా పెట్టినట్లు ఆక్స్‌ఫర్డ్‌ బయోమెడికా బుధవారం వెల్లడించింది. ఈ సంస్థ సెల్‌ థెరపీకి సంబంధించిన ఔషధాలు తయారు చేస్తుంది. ఈ నిధులతో ఆక్స్‌బాక్స్‌ప్లాంట్‌లో సంస్థ విస్తరణకు వినియోగిస్తుంది. ప్రస్తుతం ఆక్స్‌బాక్స్‌ ప్లాంట్లో కొవిడ్‌ టీకాలను తయారు చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చే స్థలంలో మరిన్ని వైరల్‌ వెక్టార్‌ ఉత్పత్తుల తయారీకి వీలుంది. 

ఈ సంస్థకు ఆక్సఫర్డ్‌లో 84వేల చదరపు అడుగుల్లో తయారీ యూనిట్‌ ఉంది.  తాజా పెట్టుబడులతో తయారీ నిబంధనలను మరింత మెరుగ్గా అమలు చేసేలా ఈ యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇవి 2023 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ డీల్‌ ప్రకారం సీరం సంస్థకు ఆక్సఫర్డ్‌ బయోమెడికాలో 3.9శాతం వాటాలు దక్కనున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని