ఫిబ్రవరిలో సేవల రంగ పీఎంఐ 55.3 - Services sector PMI 55.3 in February
close

Published : 04/03/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిబ్రవరిలో సేవల రంగ పీఎంఐ 55.3

దిల్లీ: దేశీయ గిరాకీతో భారత సేవల రంగం వరుసగా అయిదో నెలా వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సేవల రంగ వ్యాపార కార్యకలాపాల సూచీ 55.3 పాయింట్లుగా నమోదైంది. ఇది జనవరిలో 52.8 పాయింట్లుగా ఉంది. ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, దిగువన ఉంటే క్షీణతగా భావించాల్సి ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం, పెరుగుతున్న వ్యాపార ఆశావాదం వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి దోహదం చేశాయని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ సర్వే వెల్లడించింది. ‘భారత సేవల రంగంలో కార్యకలాపాలు మంచి స్థాయికి చేరాయి. సాధారణంగా నాలుగో త్రైమాసికంలో ఇవి పుంజుకుంటుంటాయి. అలాగే మూడో త్రైమాసికంలో సాంకేతిక మాంద్యం నుంచి భారత్‌ బయటకొచ్చింది. పీఎంఐ గణాంకాలు చూస్తే నాలుగో త్రైమాసికంలోనూ బలమైన వృద్ధి నమోదు చేయగలదనిపిస్తోంద’ని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పాలియానా డె లీమా వెల్లడించారు. తయారీ రంగ పీఎంఐ కూడా జనవరిలో నమోదైన 55.8 పాయింట్లతో పోలిస్తే గత నెలలో 57.3 పాయింట్లకు చేరిన సంగతి తెలిసిందే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని