యులిప్ పాల‌సీదారుల‌కు ఊర‌ట‌ - Settlement-option-for-Ulip-investors
close

Published : 27/12/2020 14:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యులిప్ పాల‌సీదారుల‌కు ఊర‌ట‌

ప్రస్తుత స్టాక్ మార్కెట్ లు 30శాతం వరకు పడిపోయాయి కాబట్టి, యులిప్స్ యూనిట్ల‌ విలువ కూడా ప‌డిపోయింది. అలాగే స్టాక్ మార్కెట్ లు ఎప్పటిలోగా కోలుకుంటాయో కూడా తెలియదు. అందువలన యులిప్స్ పాలసీదారులు, తమ వద్ద ఉన్న యూనిట్స్ ను మార్కెట్ ధరతో లెక్కిస్తే 30 శాతం వరకు నష్టపోయే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని , మే 31,2020 వరకు మెచ్యూరిటీ పొందే యులిప్ పాలసీలను , కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాల‌ని అన్ని జీవిత బీమా సంస్థలను బీమా నియంత్రణ , ప్రాధికారిక సంస్థ ఐఆర్‌డీఏఐ కోరింది.

దీనివలన పాలసీదారులు నష్టపోకుండా ఉంటారని తెలిపింది. తమ అనుకూలంగా వచ్చే ఐదు ఏళ్ల లోపు ఈ సొమ్మును తిరిగి పొందేందుకు అవకాశమివ్వాలని తెలిపింది. భవిష్యత్ లో మార్కెట్ లు తిరిగి పుంజుకుంటాయన్న , ఆశావాదంతో ఉండే పాలసీదారులు తమ పెట్టుబడులు కొనసాగించవచ్చు. ఇటువంటి నియమ నిబంధనలు పాలసీ తీసుకునే నాటికి లేనప్పటికీ , ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ అవకాశం ఇవ్వాలని కోరింది .

సాధారణంగా యులిప్స్ కాలపరిమితి ముగియగానే లంప్‌స‌మ్‌గా చెల్లిస్తాయి . జీవిత బీమా పాలసీలైన ఎండోమెంట్, మనీబ్యాక్, యులిప్స్ పాలసీలలో, కాలపరిమితి ముగియగానే , పాలసీదారుడు బీమా సొమ్మును పొందుతాడు. అదే యులిప్స్‌లో పాలసీదారుని వద్ద ఉన్న యూనిట్స్ తో అప్పటి మార్కెట్ ధర (NAV) తో గుణించి ఆ విలువను చెల్లిస్తారు.

గత ఏడాది కంటే ప్రస్తుత మార్కెట్ 30 శాతం పడిపోయింది కాబట్టి, యులిప్స్ విలువ 30 శాతం వరకు తక్కువగా వుంటుంది . అందుచేత పాలసీదారుడు తన పాలసీ సొమ్మును ఇప్పుడు కాక , భవిష్యత్ లో తీసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో ప్రమాదం ఏమిటంటే , మార్కెట్ లు మరింత పడిపోతే, యులిప్స్ విలువ కూడా పడిపోయే అవకాశం ఉంది. అందువలన పాలసీదారులు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని