IPO: శ్యామ్‌ మెటాలిక్స్‌ ఐపీవో ప్రారంభం - Shyam Metalics IPO opens
close

Published : 14/06/2021 21:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPO: శ్యామ్‌ మెటాలిక్స్‌ ఐపీవో ప్రారంభం

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టీల్‌ ఉత్పత్తి సంస్థ శ్యామ్‌ మెటాలిక్స్‌ ఐపీవో బిడ్స్‌ స్వీకరణ నేడు మొదలైంది. ఇప్పటికే ఈ సంస్థ రూ.270 కోట్లు విలువైన షేర్లను యాంకర్‌ ఇన్వెస్టర్లకు విక్రయించింది. ఈ ఐపీవో మొత్తం విలువ రూ.909 కోట్లుగా అంచనా వేస్తున్నారు. షేరు ప్రైస్‌బ్యాండ్‌ రూ.303 నుంచి రూ.306 మధ్యలో ఉంటుందని అంచనా. ఈ ఐపీవోకు బిడ్ల స్వీకరణ జూన్‌16వ తేదీన ముగుస్తుంది. ఇప్పటికే గ్రేమార్కెట్‌లో దీని షేరు రూ.155 ప్రీమియంతో ట్రేడవుతోందని మార్కెట్‌ పరిశీలకులు పేర్కొన్నారు. ఈ ఐపీవోలో రూ.657 కోట్లు విలువ చేసే కొత్త ఈక్విటీలతో పాటు ప్రమోటర్లకు చెందిన రూ. 252 కోట్లు విలువ చేసే వాటాలనుకూడా విక్రయిస్తున్నారు. ఈ ఐపీవో తర్వాత కంపెనీలో ప్రమోటర్ల వాటాలు 100శాతం నుంచి 88.35శాతానికి తగ్గుతాయి. 

ఈ ఐపీవోలో కనీసం 45 షేర్లను ఒక లాట్‌గా విక్రయిస్తున్నారు. దీనికి కేఎఫ్‌ఐన్‌ సంస్థ రిజిస్టార్‌గా వ్యవహరిస్తోంది. షేర్ల కేటాయింపులు, రీఫండింగ్‌ను ఇదే చూసుకొంటోంది. ఇక కేటాయించిన షేర్ల వివరాలను జూన్‌  21వ తేదీన వెల్లడిస్తారు. జూన్‌ 24వ తేదీన కంపెనీ లిస్ట్‌ అయ్యే అవకాశం ఉంది. దీనికి బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జేఎం ఫైనాన్షియల్‌, యాక్సెస్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ వ్యవహరించనున్నాయి.

ఈ ఐపీవో నుంచి సమీకరించిన నగదును రుణాల చెల్లింపు, వ్యాపార విస్తరణకు వినియోగించనుంది. కోల్‌కత్తాకు చెందిన ఈ కంపెనీ ‘లాంగ్‌ స్టీల్‌’ ఉత్పత్తులు, ఫెర్రో అలాయ్‌ తయారు చేస్తుంది. అంతేకాదు. ఇనప గుండ్లు, స్పాంజ్‌ ఐరన్‌, స్టీల్‌ బిల్లెట్స్‌, టీఎంటీ, స్ట్రక్చరల్‌ ప్రొడక్ట్స్‌, వైర్‌ రాడ్స్‌ వంటివి ఉత్పత్తి చేస్తుంది. దీని కర్మాగారాలు ఒకటి ఒడిశాలో, రెండు పశ్చిమబెంగాల్‌లో ఉన్నాయి. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని