close

తాజా వార్తలు

Published : 26/10/2020 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రిలయన్స్‌-‘ఫ్యూచర్‌’కు అమెజాన్‌ ఎదురుదెబ్బ!

కొనుగోలు ఒప్పందంపై సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ స్టే

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య కుదిరిన కొనుగోలు ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ఆర్బిట్రేషన్‌ విషయంలో అమెజాన్‌కు ఊరట లభించింది. ఈ ఒప్పందంపై సింగపూర్‌కు చెందిన ఆర్బిట్రేషన్ ప్యానెల్‌ స్టే విధించింది. ఈ నిలుపుదల 90 రోజుల పాటు అమలులో ఉండనుంది. 

రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందం​..

కిశోర్​బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు ఆర్‌ఐఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. ఈ ఆగస్టు చివర్లో రిలయన్స్​ అనుబంధ ఆర్‌ఆర్‌వీఎల్‌ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 

అమెజాన్‌ అభ్యంతరమేంటంటే..

ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ గతేడాది 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ కొనుగోలు చేసే హక్కు ఒప్పందం ప్రకారం అమెజాన్‌కు దఖలు పడింది. అయితే, తాజాగా రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదిస్తోంది. దీంతో సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌లో ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేసింది. ఈ నెల ఆరంభంలో ఫ్యూచర్‌ గ్రూపునకు లీగల్‌ నోటీసులు సైతం పంపింది. 

ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ ఏమందంటే..

రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంపై ఆర్బిట్రేషన్ ప్యానెల్ స్టే విధించింది. అమెజాన్ దాఖలు చేసిన ఆర్బిట్రేషన్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది నిర్ణయం తీసుకునే వరకు ఒప్పందంపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఈ నిలుపుదల 90 రోజుల పాటు అమలులో ఉండనుంది. అయితే, సాధారణంగా ‘ఇంటర్నేషన్‌ ఆర్బిట్రేషన్‌’ని భారత చట్టాలు పరిగణనలోకి తీసుకోవు. అయినా, వ్యాపార సంస్థలు మాత్రం పాటిస్తూ ఉంటాయి.

రిలయన్స్‌ ఏమంటోంది..

ఫ్యూచర్‌ గ్రూప్‌తో కుదిరిన కొననుగోలు ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళతామని రిలయన్స్‌ స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం దఖలు పడ్డ చట్టపరమైన హక్కుల్ని వినియోగించుకుంటామని తేల్చి చెప్పింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.