అదే విశ్వాసమంటే..: నిర్మలా సీతారామన్ - Sitharaman Quotes Tagore
close

Updated : 01/02/2021 14:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే విశ్వాసమంటే..: నిర్మలా సీతారామన్

బడ్జెట్ ప్రసంగంలో పలు ఉపమానాలు

దిల్లీ: కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తాజా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విశ్వాసంతో దేశం ముందుకు వెళ్లాలని కోరుకున్నారు. ప్రసంగానికి ముందు నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కవితలోని సారాన్ని ప్రస్తావించారు.

‘మునుపెన్నడూ లేని వైపరీత్యాల నడుమ..ఈ సారి వార్షిక బడ్జెట్‌ను సిద్ధం చేశాం. కొవిడ్ కారణంగా 2020లో మనకు ప్రత్యేక అనుభవం ఎదురైంది’ అంటూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే దేశమంతా విశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ‘తెలతెలవారుతుండగా ఇంకా చీకటిగా ఉండగానే పక్షి వెలుగును అనుభవిస్తుంది. అదే విశ్వాసం’ అంటూ ఠాగూర్ కవిత్వంలోని ఓ వాక్యాన్ని వినిపించారు.

ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన క్రికెట్‌ సిరీస్‌లో ఆ దేశంపై టీమిండియా విజయాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ముడిపెట్టారు. ‘ఆస్ట్రేలియాపై భారత జట్టు అద్భుత విజయం..ఈ దేశ ప్రజల స్వాభావిక శక్తిని గుర్తు చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా, కాగిత రహితంగా మార్చిన బడ్జెట్ ప్రతులను మేడిన్ ఇండియా ట్యాబ్‌లో మంత్రి పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. అంతకు ముందు వరకు ఆమె వాటిని సంప్రదాయ బాహీ ఖాటాలో పట్టుకొచ్చేవారు.

ఇవీ చదవండి:

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని