బడ్జెట్‌: ‘ఎరుపు’ రంగు ఎందుకంటే..? - Sitharaman dons red saree
close

Published : 01/02/2021 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌: ‘ఎరుపు’ రంగు ఎందుకంటే..?


 

దిల్లీ: వార్షిక బడ్జెట్ వేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎరుపు రంగు మేళవించిన చీరలో దర్శనమిచ్చారు. అలాగే బడ్జెట్ వివరాలు ఉన్న ట్యాబ్‌ను ఎరుపు రంగు కవర్‌లో ఉంచి మీడియా ముందుకు వచ్చారు. ఇలా ఈసారి ఎరుపు రంగుకు ప్రాధాన్యం ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

కరోనా సంక్షోభ సమయంలో నిర్మలమ్మ చాలా సింపుల్‌గా బడ్జెట్ ప్రసంగానికి హాజరయ్యారు. అయితే ఎరుపు రంగును శుభానికి గుర్తుగా పరిగణిస్తారని నిపుణులు అంటున్నారు. అలాగే ప్రేమ, శక్తి, శ్రద్ధ, బలం వంటి భావోద్వేగాలను ఈ రంగు ప్రతిబింబిస్తుందన్నారు. అందుకే ఈ రంగుకు ఆమె ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, ఆర్థిక మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఎక్కువగా భారతీయతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. లెదర్‌ సూట్‌కేసుల స్థానంలో సంప్రదాయ బాహీ ఖాటా (వస్త్రం లాంటి సంచి)లో గత రెండు బడ్జెట్‌ పత్రాలు తీసుకొచ్చారు. ఈ సారి మేడిన్‌ ట్యాబ్‌ను అదే తరహా సంచిలో తీసుకొచ్చారు.

ఇదీ చదవండి..

బడ్జెట్ వివరాలు యాప్‌లో వీక్షించండి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని