ధరలు పెంచనున్న స్కోడా - Skoda looking to hike car prices by up
close

Published : 29/12/2020 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధరలు పెంచనున్న స్కోడా

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం స్కోడా భారత్‌లో తన మోడల్స్‌ ధరలను పెంచనుంది. ఈ పెంపు 2.5శాతం వరకు ఉంటుంది. 2021 జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి రానుంది. ముడిపదార్థాల ధరలు పెరగడంతో ఈ పెంపు తప్పలేదని కంపెనీ పేర్కొంది. ముడిపదార్థాల ధరలు చాలా కంపెనీలపై ప్రభావం చూపాయి. ఇప్పటికే  పలు ఆటో మొబైల్‌ కంపెనీలు జనవరి 1 నుంచి ధరలు పెంచుతామని ప్రకటించాయి. 

‘‘ ప్రపంచ వ్యాప్త పరిస్థితుల కారణంగా ముడిపదార్థాల ధరలు పెరిగాయి. దీంతో ఉత్పత్తి ధర కూడా పెరిగిపోయింది. దీనికి తోడు విదేశీ మారకరేట్లు ఇటీవల కాలంలో పెరిగాయి. ఇప్పటి వరకు స్కోడా ఇండియా వీటిని తట్టుకొని నిలబడింది. ఇక జనవరి 1వ తేదీ నుంచి మోడల్స్‌ రేంజిని బట్టి ధరలు 2.5శాతం వరకు పెరగనున్నాయి’’ స్కోడా ఆటో ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. 

ఇవీ చదవండి..

బజాజ్‌ ఆటో @ రూ. లక్ష కోట్లు

పట్టిందల్లా డబ్బే!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని