ఫిబ్రవరిలో నెమ్మదించిన తయారీ - Slow preparation in February
close

Published : 02/03/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిబ్రవరిలో నెమ్మదించిన తయారీ

 కొత్త ఆర్డర్లలో వృద్ధి

దిల్లీ: దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు జనవరితో పోలిస్తే, ఫిబ్రవరిలో స్పలంగా నెమ్మదించాయి. అయితే కంపెనీలు కొత్త ఆర్డర్లు తీసుకోవడం పెరుగుతున్నందున, కొనుగోళ్ల కార్యకలాపాలు, ఉత్పాదకత మెరుగయ్యిందనే విషయాన్ని సూచిస్తోందని పీఎంఐ సర్వే వెల్లడించింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఫిబ్రవరిలో 57.5 పాయింట్లుగా నమోదైంది. జనవరిలో ఇది 57.7 పాయింట్లుగా ఉంది. జనవరితో పోలిస్తే వృద్ధి తగ్గినప్పటికీ.. దీర్ఘకాలిక సగటు అయిన 53.6 పాయింట్ల కంటే ఫిబ్రవరిలో ఈ సూచీ అధికంగానే ఉండటం గమనార్హం. పీఎంఐ సూచీ 50 పాయింట్లకు ఎగువన ఉంటే ఆ రంగంలో వృద్ధి ఉన్నట్లు. కొవిడ్‌-19 సంబంధించి ఆంక్షలు తొలగినప్పటికీ ఉద్యోగకల్పన మాత్రం తగ్గిందని నివేదిక పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని