close
Array ( ) 1

తాజా వార్తలు

ఫోన్ల ధరలు 7శాతం వరకు పెరగొచ్చు..!  

బీజింగ్‌: కరోనా(కొవిడ్‌-19) వైరస్‌ ప్రభావం భారత వ్యాపార రంగంపై కూడా పడనుంది. ఈ ప్రభావం వచ్చే 15రోజుల్లో కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్లు, ఫ్యూచర్‌ ఫోన్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి. ఫీచర్‌ ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని మెగ్‌అజ్‌ మొబైల్స్‌ సంస్థ సీఈవో నిఖిల్‌ చోప్రా తెలిపారు. ఈ పెంపు 10శాతం వరకు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక స్మార్ట్‌ ఫోన్ల ధరలు 6-7శాతం పెరిగే అవకాశం ఉంది. మరో 15-20 రోజుల్లోపే ఈ ఎఫెక్ట్‌ ఉండనుంది. ఇక ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లపై ప్రభావం మాత్రం నామమాత్రమే. ఎందుకంటే భారత్‌లో వీటి మార్కెట్‌ వాటా చాలా తక్కువగా ఉండటమే కారణం.

కరోనా వైరస్‌ కారణంగా చైనాలోని విడిభాగాలు తయారయ్యే కంపెనీలు మూతపడటంతో ఆ ప్రభావం ఫోన్ల ధరలపై చూపనుంది. దీని ప్రభావం అత్యధికంగా 180 రోజులపాటు ఉండే అవకాశం ఉంది. చైనా సంస్థ షామికి చెందిన రెడ్‌మీ8 ఫోన్‌ ధరను ఇప్పటికే పెంచేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.