భారత్‌లోకి సరికొత్త హైబ్రీడ్‌ ట్రాక్టర్‌ - Solis 5015 Hybrid Tractor Launched In India
close

Published : 14/04/2021 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లోకి సరికొత్త హైబ్రీడ్‌ ట్రాక్టర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సోలీస్‌ యాన్మార్‌ రేంజస్‌ పరిధిలోని ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ (ఐటీఎల్‌) భారత్‌లో సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. సోలీస్‌ హైబ్రీడ్‌5015 పేరుతో ట్రాక్టర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.7.21లక్షలుగా నిర్ణయించింది. దీంతో భారత్‌కు ఈ పవర్‌ బూస్ట్‌ టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఐటీఎల్‌కు దక్కింది. ఈ టెక్నాలజీకి సంబంధించిన పలు పేటెంట్లు సంస్థ పేరిట ఉన్నాయి. భారత్‌లో 4వీల్‌ డ్రైవ్‌లో సోలీస్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైబ్రీడ్‌ 5015 ట్రాక్టర్‌ ఉపయోగపడుతుంది. 

ట్రాక్టర్‌ విడుదల సందర్భంగా ఐటీఎల్‌ కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ రమన్‌ మిత్తల్‌ మాట్లాడుతూ ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగించే సరికొత్త టెక్నాలజీలను అందుబాటు ధరల్లో రైతుల కోసం మేము భారత్‌కు తీసుకొచ్చేందుకు  కట్టుబడి ఉన్నాము. సరికొత్త ట్రాక్టర్‌కు మూడు ట్రాక్టర్లంత శక్తి ఉంది. 50హార్స్‌ పవర్‌ ట్రాక్టర్‌ను ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో మార్పులు చేయడంతో అవసరాలను బట్టి 60హెచ్‌పీ ట్రాక్టర్‌ వలే  ఉపయోగపడుతుంది. 45హెచ్‌పీ ట్రాక్టరంతే ఇంధనం వాడుకొంటుంది. మూడు ట్రాక్టర్ల ప్రయోజనాలను ఒకే ట్రాక్టర్‌ నుంచి పొందవచ్చు’’ అని పేర్కొన్నారు. 

సోలీస్‌ హైబ్రీడ్‌ 5015 ట్రాక్టర్‌లో డీజిల్‌ ఇంజిన్‌కు ఎలక్ట్రిక్‌ మోటార్‌ను అనుసంధానించారు. దీంతో ట్రాక్టర్‌ 50హెచ్‌పీ శక్తిని సాధించడంతోపాటు.. ఇంధనాన్ని పొదుపుగా వాడుకొంటుంది. దీంతోపాటు ట్రాక్టర్‌లో డ్యాష్‌బోర్డులో పవర్‌ బూస్టర్‌ స్విచ్చితో పాటు హ్యాండ్‌ ఆపరేటెడ్‌ లివర్‌ ఉంది.  

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని