Gold Bonds: మార్కెట్‌లోకి మ‌రోసారి సార్వ‌భౌమ ప‌సిడి - Sovereign-Gold-Bond-Scheme-2021-22-which-will-open-for-subscription
close

Updated : 15/05/2021 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gold Bonds: మార్కెట్‌లోకి మ‌రోసారి సార్వ‌భౌమ ప‌సిడి

ఈ మే 17 నుండి 5 రోజుల పాటు చందా కోసం తెర‌వ‌బ‌డే సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కం (సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీమ్) ఇష్యూ ధ‌ర గ్రాముకు రూ. 4,777గా నిర్ణ‌యించిన‌ట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మే 2021 నుండి 2021 సెప్టెంబ‌ర్ వ‌ర‌కు 6 విడ‌త‌ల‌లో బాండ్ల‌ను జారీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. భార‌త ప్ర‌భుత్వం త‌ర‌పున ఆర్‌బీఐ ఈ బాండ్ల‌ను జారీ చేస్తుంది.

చందా కాలానికి ముందు వారంలోని చివ‌రి 3 ప‌నిదినాల‌లో 999 స్వ‌చ్ఛ‌త యొక్క బంగారం స‌గ‌టు ధ‌ర ఆధారంగా బాండ్ యొక్క విలువ ఒక గ్రాము బంగారానికి రూ. 4,777గా ఆర్‌బీఐ నిర్ణ‌యించింది. ఆర్‌బీఐతో సంప్ర‌దించి ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌లో ధ‌ర‌ఖాస్తు చేసుకునే పెట్టుబ‌డిదారుల‌కు నామ‌మాత్ర‌పు విలువ కంటే గ్రాముకు రూ. 50 త‌గ్గింపు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇటువంటి పెట్టుబ‌డిదారుల‌కు బంగారు బాండ్ యొక్క ఇష్యూ ధ‌ర గ్రాము బంగారానికి రూ. 4,727గా ఉంటుంద‌ని ఆర్‌బీఐ తెలిపింది.

సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 సిరీస్‌-1 (మొద‌టి విడ‌త) మే 17, 2021 నుండి 2021 మే 21 వ‌ర‌కు చందా కోసం తెరిచి ఉంటుంది. మ‌రియు మే 25న బాండ్లు జారీ చేయ‌బ‌డ‌తాయి. ఈ బాండ్లు బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మ‌రియు చెల్లింపు బ్యాంకులు మిన‌హా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), సెల‌క్ట్ చేయ‌బ‌డిన‌ పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు, నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ ద్వారా విక్ర‌యించ‌బ‌డ‌తాయి.

ఇండియా బులియ‌న్ అండ్ జ్యువెల‌ర్స్ అసోసియేష‌న్ లిమిటెడ్ ప్ర‌క‌టించిన 999 స్వ‌చ్ఛ‌త బంగారం ముగింపు స‌గ‌టు ధ‌ర ఆధారంగా చందా కాలానికి ముందు వారంలోని చివ‌రి 3 ప‌ని దినాలు ధ‌ర బేస్ చేసుకుని బాండ్ ధ‌ర భార‌త క‌రెన్సీ రూపాయిల‌లో నిర్ణ‌యించ‌బ‌డింది.

ప్రాధ‌మికంగా 1 గ్రాము నుండి అనేక గుణ‌కాల‌లో బంగారం బాండ్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. 8 సంవ‌త్స‌రాలు బాండ్ పీరియ‌డ్ ఉంటుంది. అయితే 5వ సంవ‌త్స‌రం త‌ర్వాత నిష్క్ర‌మ‌ణ అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నీసం అనుమ‌తించ‌ద‌గిన పెట్టుబ‌డి 1 గ్రాము బంగారం. చందా యొక్క గ‌రిష్ట ప‌రిమితి వ్య‌క్తికి 4 కిలోలు, హెచ్‌యూఎఫ్‌కు 4 కిలోలు మ‌రియు ట్ర‌స్ట్‌ల‌కు 20 కిలోల వ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ బాండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం భౌతిక బంగారం డిమాండ్‌ను త‌గ్గించ‌డం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని అంటే డైర‌క్ట్‌గా బంగారం లాంటివి కొన‌కుండా, ఆర్థిక పొదుపుగా మార్చాల‌నే ల‌క్ష్యంతో ఈ ప‌థ‌కాన్ని న‌వంబ‌ర్ 2015లో ప్రారంభించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని