మార్కెట్లోకి సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కం - Sovereign-Gold-Bond-Scheme-Series-XII-will-be-open
close

Updated : 27/02/2021 14:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లోకి సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కం

సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కం 2020-21 సిరీస్ XII మార్చి 1 నుంచి మార్చి 5 వ‌ర‌కు పెట్టుబ‌డుల‌ కోసం తెరిచారు. సెటిల్మెంట్ తేదీ మార్చి 9. క‌నీస అనుమ‌తించ‌ద‌గిన పెట్టుబ‌డి 1 గ్రాము బంగారం. గ‌రిష్ట ప‌రిమితి వ్య‌క్తికి 4 కిలోలు, హెచ్‌యుఎఫ్ (హిందు అవిభాజ్య కుటుంబం)కు 4 కిలోలు, ట్ర‌స్టుల‌కు 20 కిలోలుగా ప‌రిగ‌ణిస్తారు. సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కం ఇష్యూ ధ‌ర గ్రాముకు రూ. 4,662గా నిర్ణ‌యించారు. సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కం 2020-21ను కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ఆర్‌బీఐ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కం ఇష్యూ ధ‌ర గ్రాము బంగారానికి రూ. 4,662గా నిర్ణ‌యించిన‌ట్లు ఆర్‌బీఐ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఆన్‌లైన్‌లో దర‌ఖాస్తు చేసుకునే పెట్టుబ‌డిదారుల‌కు గ్రాముకు రూ.50 త‌గ్గింపును అందిస్తోంది. అటువంటి పెట్టుబ‌డిదారుల‌కు, గోల్డ్ బాండ్ యొక్క ఇష్యూ ధ‌ర గ్రాము బంగారానికి రూ. 4,612గా ఉంటుంద‌ని సెంట్ర‌ల్ బ్యాంక్ తెలిపింది.

ఫిబ్ర‌వ‌రి 1 నుండి ఫిబ్ర‌వ‌రి 5, 2021 వ‌ర‌కు పెట్టుబ‌డి కోసం తెరిచిన బాండ్ల సిరీస్ X ఇష్యూ ధ‌ర గ్రాము బంగారానికి రూ. 4,912గా ఉన్న విషయం తెలిసిందే. ఈ బాండ్ పూర్తి కాలం 8 సంవ‌త్స‌రాలు, 5వ సంవ‌త్స‌రం నుంచి నిష్క్ర‌మ‌ణకు అనుమ‌తి ఉంది. ఈ బాండ్లు (భార‌త‌) వ్య‌క్తులు, హెచ్‌యుఎఫ్‌లు, ట్ర‌స్ట్‌లు, విశ్వ‌విద్యాల‌యాలు మ‌రియు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు అమ్మ‌డానికి ప‌రిమితం చేశారు.

సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కం బాండ్స్‌ను బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మ‌రియు చెల్లింపు బ్యాంకులు మిన‌హా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), ఎంపిక చేయ‌బ‌డ్డ పోస్టాఫీసులు మ‌రియు గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు (ఎన్ఎస్ఇ మ‌రియు బిఎస్ఇ)ల‌ ద్వారా విక్రయిస్తారు.

ఈ బాండ్స్ ముఖ్య ఉద్దేశ్యం.. భౌతిక బంగారం డిమాండ్‌ను త‌గ్గించ‌డం, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు బ‌దులుగా.. ఆర్థిక పొదుపుగా మార్చాల‌నే ల‌క్ష్యంతో సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కాన్ని న‌వంబ‌ర్ 2015లో ప్ర‌భుత్వం ప్రారంభించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని