close
Array ( ) 1

తాజా వార్తలు

స్పైస్‌జెట్‌ నుంచి మరో 20 విమానాలు

గురుగ్రామ్‌: తక్కువ ధరల్లో విమానప్రయాణం అందించే విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ నుంచి  మరో 20  విమానాలు రానున్నాయి. మార్చి 29 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నట్టు ఆ సంస్థ అధికారవర్గాలు తెలిపాయి. కొత్త విమానాలు గౌహాతీ-పట్నా, హైదరాబాద్‌-మంగుళూరు, బెంగళూరు-జబల్‌పూర్‌, పట్నా-వారణాశి, ముంబాయి- ఔరంగబాద్‌ల మధ్య సర్వీసు నడపనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ కొత్త సర్వీసులతో దేశీయంగా 12 నగరాలను కలుపుతూ 52 విమానాలను వినియోగంలోకి వస్తాయని స్పైస్‌జెట్‌ పేర్కొంది. ఆ సంస్థ ముఖ్య వాణిజ్య అధికారి శిల్పా భాటియా మాట్లాడుతూ.. దేశీయంగా ప్రయాణికులకు అందుబాటులో ఉండే టికెట్టు ధరలతో తమ విమానసర్వీసులు నడుపుతున్నామని, మరిన్ని విమాన సర్వీసులను పెంచి ఇప్పటివరకు ఎయిర్‌కనెక్టివిటీ లేని ప్రాంతాలలో కూడా విస్తరిస్తామన్నారు. అలాగేముంబయి-చెన్నై, హైదరాబాద్‌- మంగళూరు, గౌహాతీ-దిల్లీల మధ్య రానున్న కాలంలో బోయింగ్‌ 737-800, బోంబార్డియర్‌ క్యూ400 విమానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.