సర్వోమ్యాక్స్‌ ఇండియా ఆస్తుల వేలాన్ని నిలపండి - Stand the auction of Servomax India assets
close

Published : 12/02/2021 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్వోమ్యాక్స్‌ ఇండియా ఆస్తుల వేలాన్ని నిలపండి

ఎన్‌సీఎల్‌టీలో మధ్యంతర పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: లిక్విడేషన్‌ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న సర్వోమ్యాక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐపీఎల్‌) ఆస్తుల వేలాన్ని నిలిపివేయాలంటూ గురువారం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలైంది. లిక్విడేటర్‌ జి.మధుసూదన్‌రావు వ్యవస్థాపకుడితో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ఆస్తుల విలువను తగ్గించి నిర్వహిస్తున్న వేలం ప్రక్రియను నిలిపివేయాలంటూ వై.మల్లికార్జునరావు, సీహెచ్‌.నాగరాజులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్‌ఐపీఎల్‌ వ్యవస్థాపకుడైన అవసరాల వెంకటేశ్వరరావుతో కుమ్మక్కైన లిక్విడేటర్‌, కంపెనీ ఆస్తులను తక్కువ ధరకు కట్టబెట్టి, రుణదాతలకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ కంపెనీకి షాబాద్‌ మండలంలో ఉన్న ఆరెకరాల భూమిని ఎస్‌ఐపీఎల్‌ మాజీ డైరెక్టర్‌ తండ్రికి విక్రయించారన్నారు. ప్రస్తుతం ఇతర ఆస్తులకు సరైన స్పందన లేదంటూ విలువ తగ్గించి ఇ-వేలం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. లిక్విడేటర్‌ నిర్వహిస్తున్న ఆస్తుల వేలాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని, ఆర్వోసీ, ఐబీబీఐలు లిక్విడేటర్‌ చర్యలను పరిశీలించేలా ఆదేశించాలని కోరారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని